కనిగిరి: హనుమంతునిపాడు మండలంలో పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు పంపిణీ చేయాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
హనుమంతునిపాడు మండలంలోని భూమిలేని నిరుపేదలకు సాగుభూములు, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం తక్షణం మంజూరు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఇల్లు లేని పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం, భూమిలేని పేదలకు సాగు భూములను ప్రభుత్వం మందులు చేయాలని డిమాండ్ చేశారు.