రాప్తాడు: కురుకుంట వద్ద మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో దిలీప్ మిస్సింగ్ పై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే కురుగుంట వద్ద మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల వద్ద గురువారం ఒకటిన్నర గంటల సమయంలో దిలీప్ కుమార్ అనే విద్యార్థి మిస్సింగ్ పై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కోశాధికారి ఆంజనేయులు నగర కార్యదర్శి ఉమామహేష్ తదితరులు మాట్లాడుతూ బుధవారం 12:30 గంటల సమయంలో దిలీప్ మాస్టర్ మైండ్ కళాశాల నుంచి కనిపించకుండా పోవడం జరిగిందని, అయితే కళాశాల యజమాను నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్సింగ్ కావడం జరిగిందని ఈ సంఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ వంశీ ఉమా మహేష్ తదితరులు డిమాండ్ చేశారు.