ఒంగోలు అర్బన్: ఒంగోలులో టిడిపి పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన కూటమి పత్తి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు
Ongole Urban, Prakasam | May 6, 2026
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లో ఒంగోలు పార్లమెంటు టిడిపి కార్యాలయ భవనం నిర్మాణానికి మంత్రి స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ప్రభుత్వ స్థలంలో లీజు పద్ధతిలో 2ఎకరాల స్థలంలో సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీకి శాశ్వత కార్యాలయం ఏర్పాటు దిశగా ఇది కీలక అడుగు అని.. ఆరు నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.