ఎల్లారెడ్డిపేట: ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.. అత్యవసర సమయాల్లోనే ఇంటి నుంచి బయటకు రావాలంటున్న అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట,బోప్పపూర్, బండలింగంపల్లి, సింగారం, నారాయణపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరుతున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు ఈ విధంగానే వర్షాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండొద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఉక్కపోతగా వాతావరణం ఉండడం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురుస్తుంది.