బనగానపల్లె: మహానాడు ఏర్పాట్లలో నంద్యాల మంత్రులు బిజీ
నెల్లూరులో జరగనున్న టీడీపీ మహానాడు విజయవంతం కోసం నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. మే 27 నుంచి 29 వరకు కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి, భోజనాల కమిటీ పనులపై పలు సూచనలు చేశారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.