కార్మికుల 8గంటల పని విధానాన్ని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ 10గంటలకు చేయడం దుర్మార్గమంటూ నరసరావుపేటలో కార్మికుల నిరసన
కూటమి ప్రభుత్వ 8గంటలు పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ రాత్రి వేళల్లో మహిళల చేత పని చేయించాలనే GOలను తీసుకురావడం విరమించుకోవాలని GOలను రద్దు చేయాలని పల్నాడు జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేటలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.CITU నరసరావుపేట మండల కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని తుట్లు పోడుస్తూ చంద్రబాబు మరియు కుటమి ప్రభుత్వం 10గంటల పని విధానాన్ని, మహిళలను రాత్రిపూట పని చేయించాలనే నిర్ణయం చేయడం దుర్మార్గమన్నారు.