బనగానపల్లె: అవుకు మండలంలో మే 6న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
నంద్యాల జిల్లా అవుకు మండలంలో శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగా వచ్చేనెల 6న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతిగా రూ.80 వేలు, మూడో బహుమతిగా రూ.60 వేలు, నాలుగో బహుమతిగా రూ.40 వేలు, ఐదో బహుమతిగా రూ.20 వేలు నగదు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.