నిజామాబాద్ సౌత్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గురువారం సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో ఎస్.ఐ.ఆర్ అమలు కోసం చేపడుతున్న కసరత్తు, ముందస్తు సన్నద్ధతపై సమీక్ష జరిపారు. 2002 ఓటరు జాబితాతో కొత్త ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్లకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్ నిర్వహించాలన్నారు.