బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలు, పాల్గొన్న మంత్రి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కష్టపడే తత్వం, క్రమశిక్షణ, దూరదృష్టితో కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. విజనరీ నాయకుడైన ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.