భూ రీ సర్వే ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కొలిమిగుండ్ల తహశీల్దార్ సాయి విశ్వతేజ పేర్కొన్నారు. సోమవారం కోటపాడు గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో నూతన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులు రీ సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు గుండం సొసైటీ ప్రతినిధి మూల శివారెడ్డి, సర్పంచ్ సుంకమ్మ, టీడీపీ నేత సూరి శివరామిరెడ్డి పాల్గొన్నారు.