కేతేపల్లి: మూసి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం, 8 గేట్లను 2 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం, మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ఆదివారం మధ్యాహ్నం 8 గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి దిగువకు 10406 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9510 క్యూసెక్కుల నీరు వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 643.78 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారి మధు తెలిపారు.