సంగారెడ్డి: వందేమాతర గీతం మన దేశ ఐక్యతకు నిదర్శనమని ప్రతి విద్యార్థి భావన కలిగి ఉండాలి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
వందేమాతర గీతం మన దేశ ఐక్యతకు నిదర్శనం అని ప్రతి విద్యార్థి భావన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గీతాన్ని బక్కిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు శుక్రవారం సామూహిక గీతాలాపన నిర్వహించగా కలెక్టర్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతరం గేయం లోని ప్రతి భావం ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి భారతదేశం ఒక్కటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.