మార్కాపురం జిల్లా దోర్నాల నల్లమల అడవి ప్రాంతంలో వెలిసిన ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు అమ్మవారి చల్లని చూపు ఉండాలని పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి వెనుకబడిన ఈ ప్రాంతం కృష్ణా జలాలతో సస్యశ్యామలం కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.