బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో జూలై 4న దుకాణాలకు వేలం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోనిప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జులై 4వ తేదీన బహిరంగ వేలం, సీల్డు టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో రుద్రాక్షమాలలు, కరుంగలి మాలలు, రక్షధారులు, రాగి కడియాలు, పూసల మాలల విక్రయ హక్కుల కోసం ఈ వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే వ్యాపారులు నిబంధనల మేరకు రూ.లక్ష డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని ఆయన కోరారు.