ఒంగోలు అర్బన్: ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గాడిద మాంసం పేరుతో గుర్రాల మాంసాన్ని విక్రయిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరులో ఆదివారం ఆరుగురిని ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాడిద మాంసం పేరుతో గుర్రాల మాంసాన్ని విక్రయిస్తున్నారని అందిన సమాచారం మేరకు మాంసం, 4 ఆటోలు, ఓ కారు సజీవంగా ఉన్న రెండు గుర్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.