మద్యం కుంభకోణంలో వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను నిన్న విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. శనివారం ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిద్ కార్యాలయానికి తరలించి కేసు వివరాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం మరల రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది.