బనగానపల్లె: సంజామల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలోని కమలాపురి వసంతాపురం గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు కమలాపురి గ్రామంలో 33 లక్షల రూపాయల వ్యయంతో కాలువలతో కూడిన అంతర్గత సిసి రోడ్లు హిందూ స్మశాన వాటికకు నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు అనంతరం వసంతాపురం గ్రామంలో ఎస్సీ అండ్ బీసీ కాలనీలో 35 లక్షల రూపాయలతో చేపట్టిన పక్కా కలవలతో కూడిన అంతర్గత సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గ్రామాలకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టిడిపి శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు