పేర్నమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొన్న ఇన్నోవా కారు,ద్విచక్ర వాహనదారుని మృతి, కేసు నమోదు
Ongole Urban, Prakasam | Sep 14, 2025
ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. నగరంలోని సమతా నగర్ కు చెందిన శేషయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై పేర్నమిట్ట వెళుతుండగా మార్గమధ్యంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొనడంతో ఆయన ఎగిరి కిందపడ్డాడు.తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.