చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలో కరెంట్ షాక్తో ఒకరి మృతి
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ కథనం మేరకు.. వడ్డేమాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని వాగు వద్ద పంట చెరుకు కోసమని అదే గ్రామానికి చెందిన బోయ భీమన్న (50) వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య చిట్టెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది