ఆత్మకూరు: అమరచింత: ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి... ఎంపీడీఓ శ్రీనివాసులు
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అమరచింత మండల ప్రత్యేక అధికారి సయ్యద్ సుల్తాన్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామల్లోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య తలేత్తకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు