డోన్: గొర్లగుట్ట మలుపు వద్ద ప్రమాదకరంగా కొబ్బరి చెక్కల గుట్ట
Dhone, Nandyal | May 1, 2026 నంద్యాల జిల్లాబేతంచెర్ల మండలంలోని గోర్లగుట్ట మలుపులో రహదారి పక్కన భారీగా కొబ్బరి చెక్కలను గుంపుగా వేశారు. రహదారి మలుపు వద్ద ఈ చెక్కల గుట్ట ఉండటం వల్ల వాహనదారులకు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ రహదారి గుండా నిత్యం నాపరాయి ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు జరుగుతుంటాయి. ఇప్పటికైనా కొబ్బరి చెక్కల గుట్టను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.