ఒంగోలు అర్బన్: ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసిపి అధ్యక్షుడు బూచేపల్లి,శివయ్య క్షమించడంటూ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్
Ongole Urban, Prakasam | Jun 14, 2026
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గతంలో శ్రీశైలంలో నిర్మించిన కాటేజ్ గురించి మాట్లాడారు. ఆ కాటేజ్ ని శ్రీశైలం దేవస్థానం వారికి అప్పగించడం జరిగిందన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించామని ఆ కార్యక్రమాన్ని ప్రజలలో దారి మళ్లించేందుకు దేవుళ్లను అడ్డుపెట్టుకుంటున్నారని తాము దేవుడి సొమ్ము ఎప్పుడు తినమని మాకు అంత అవసరం లేదని శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.