గుంతకల్లు: గుత్తి పెన్షనర్ల భవనంలో ఘనంగా మహాకవి కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మి నరసింహం 158వ జయంతి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో చిలక మర్తి నరసింహం 158వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా చిలక మర్తి నరసింహం చిత్ర పటానికి కార్యదర్శి రామ్మోహన్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకమర్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కవి, నాటక కర్త, సంఘ సంస్కర్త, విద్యా వేత్త అన్నారు. తెలుగు సాహిత్య అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారన్నారు.1909లో సామాజికంగా వెనుకబడిన వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకించి ఒక పాఠశాలను స్థాపించారన్నారు.