తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించిన బీసీవై పార్టీ నేతలు
Ongole Urban, Prakasam | Apr 8, 2026
ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద బీసీ వై పార్టీ ఆధ్వర్యంలో బీసీల ఐదు డిమాండ్ల సాధన కోసం బుధవారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ వై పార్టీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ గాలం బలరామ్ నాయకత్వం వహించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా న్యాయవాదులు పాలెపోగు బాబురావు,K.శ్రీనివాసరెడ్డి, సాహో ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టి బాబు,మరియు G. మిరయరాజు గారు వచ్చి బీసీలకు సంబంధించిన ఈ ఐదు డిమాండ్లు న్యాయమైన వని తమ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది..