పుంగనూరు: మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ ను పరామర్శించిన. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్
యామల సుదర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవవర్గం .చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ లో సోమవారం భూవివాదంలో గాయపడ్డ పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ ను మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శనం పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ పై దాడికి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ ఆర్.అశోక్, మాల మహానాడు సంఘం సభ్యులు పాల్గొన్నారు