బనగానపల్లె: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంనందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కాటేజీలు రూ. 22 లక్షలు, నూతన టాయిలెట్స్ రూ. 18 లక్షలతో నిర్మించనున్నారు. వాటికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఛైర్మన్ పీ.వీ. నాగార్జున రెడ్డి భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యం కోసం నిర్మిస్తున్నామని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.