బనగానపల్లె: సంజామలలో పెంపుడు కుక్కలకు టీకాలు
నంద్యాల జిల్లా సంజామల ప్రాంతీయ పశువైద్యశాల (AVH)లో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏడీ డా. కొండారెడ్డి ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు డా. కృష్ణకుమార్, డా. కస్తూరి పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేశారు. ముందస్తు టీకాలతో ఈ వ్యాధి నియంత్రించవచ్చాన్నారు. పశుసంవర్ధక శాఖ కార్య దర్శి మహబూబ్ బేగ్ పాల్గొన్నారు.