ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ పొదుపు రేపటి భవితకు మలుపు విద్యుత్ సౌర్యం సామాజిక నేరమంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.