సూర్యాపేట: ప్రపంచానికి సనాతన ధర్మం ఆదర్శం: సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ప్రపంచ దేశాలకు సనాతన ధర్మం ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేటలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ ఆధ్యాత్మిక సంఘాల ఐక్యతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీలతో కలిసి సనాతన ధర్మంపై ఆయన చర్చించారు.