ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న బంగారు వెండి ఇతడి వస్తువులు కనపడడం లేదని పాత కమిటీ సభ్యురాలు నారాయణమ్మ ఆరోపించారు. పాత కమిటీ తీర్మానం లేకుండా నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారని స్వామివారికి అలంకరిస్తున్న వస్తువులు లేకపోవడంతో అనుమానం వచ్చిందని అన్నారు. స్వామి వారి నగలు ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు.