నంద్యాల అర్బన్: నంద్యాల తృప్తి కాంటీన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 1, 2026
తృప్తి క్యాంటీన్ లో పరిశుభ్రతను కచ్చితంగా పాటిస్తూ వినియోగదారులకు అందించే ప్రతి ఆహార పదార్థం నాణ్యతతో ఉండేలా ఆరోగ్యానికి హానికరం కాని విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి క్యాంటీన్ నిర్వహకులకు సూచించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తృప్తి కాంటీన్ సందర్శించిన ఆమె అక్కడ పరిశుభ్రత నిర్వహణ విధానాలను సమగ్రంగా పరిశీలించారు