సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ ఇందిరా కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
సంగారెడ్డి మున్సిపాలిటీ ఇందిరా కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డి అనురాధ నేతృత్వంలోని బృందం ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సభ్యులతో పాటు స్థానిక వైద్య బృందం పాల్గొంది.