ఆళ్లగడ్డ: పడగండ్ల ప్రభుత్వపాఠశాలలో, అమరావతి ఆకారంలో విద్యార్థులు
అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడంపై ఆళ్లగడ్డ మండల పరిధిలోని పడగండ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం అపుస్మా డివిజనల్ ప్రసెంట్ అమీర్ భాష ఆధ్వర్యంలో విద్యార్థులను అమరావతి ఆకారంలో కూర్చోబెట్టి వినూత్నంగా వేడుక నిర్వహించారు, ఈ సందర్భంగా రాష్ట్రపతి కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ మద్దతును చాటారు