అనంతపురం అర్బన్: నగరంలోని సంగమేశ్వర సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం నగరంలోని సంగమేశ్వర సర్కిల్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడప జిల్లాలోని చింత కొమ్మల దీన్నే గ్రామానికి చెందిన మహబూబ్బాషా అనే యువకుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.