సిర్పూర్ టి: అందరూ శాకాహారులే రొయ్యల ముల్లె ఏడబాయే. బిజెపి మద్దతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు
చింతల మానేపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బీసీ తెలంగాణ జేఏసీ తలపెట్టిన బందు సందర్భంగా వ్యాపారస్తులు, వాణిద్య సంస్థలు స్వచ్ఛంద బందులో పాల్గొన్నారు. బిసి బందుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడంతో అసలు బీసీల పోరాటం ఎవరి పైనా ప్రజలు గమనించాలని డబ్బా గ్రామానికి చెందిన సాగర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా బీసీలను మోసం చేస్తున్నాయని దీనిని బీసీ లందరూ గమనించి వారిపై పోరాటం కొనసాగించాలని అన్నారు.