ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు చేసిన నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు
Nandyal Urban, Nandyal | Mar 31, 2026
మధ్య ప్రదేశ్ లోని క్షిప్రానది ఒడ్డున ఉన్న అత్యంత పురాతనమైన, పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాలేశ్వరునికి, మహంకాళి అమ్మవార్లకు ఎంపీ దంపతులు విశేష పూజలు చేశారు.