జహీరాబాద్: స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన నిరసన
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కాలేజ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాలనుండి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.వెంటనే ప్రభుత్వం స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రిజల్ట్స్ చేయాలని డిమాండ్ చేశారు