డోన్: డోన్ లో పక్షవాత బాధితురాలకి అండగా స్ఫూర్తి సంస్థ
Dhone, Nandyal | May 30, 2026 డోన్ పట్టణానికి చెందిన పక్షవాత బాధితురాలు లక్ష్మికి స్ఫూర్తి సంస్థ శనివారం అండగా నిలిచింది. ఆమె ఇబ్బందులను గుర్తించిన సంస్థ సభ్యులు, ఓ అజ్ఞాత దాత ఆర్థిక సహకారంతో రూ.10,000 విలువైన మెడికల్ ఐరన్ మంచాన్ని బెడ్తో సహా ఉచితంగా అందజేశారు. సాయం అందుకున్న బాధితురాలు లక్ష్మి ఆ అజ్ఞాత దాతకు, సంస్థ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.