శ్రీశైలంలో పాతాళగంగ రోప్‌వే వద్ద NDRF ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
శ్రీశైలంలో పాతాళగంగ రోప్‌వే వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ పర్యవేక్షణలో 30 మంది రెస్క్యూ సిబ్బంది, టూరిజం రోప్‌వే సిబ్బంది పాల్గొన్నారు.కేబుల్ కారులో ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి, మధ్యలో ఆగిపోయిన కార్లకు ఎలా చేరుకోవాలి, పర్యాటకులను ఎలా రక్షించాలి అనే అంశాలపై ప్రదర్శన ఇచ్చారు.రోప్‌వే సిబ్బందితోనే రెస్క్యూ చర్యలు చేపట్టిస్తూ అవగాహన కల్పించారు.రోప్‌వే మేనేజర్ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రమాదాల సమయంలో స్పందించే విధానం నేర్చుకున్నామని తెలిపారు.