బనగానపల్లె: కొలిమిగుండ్లలో ముగిసిన మొహరం వేడుకలు
కొలిమిగుండ్ల మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి.ఈ సందర్భంగా ఎస్సై నగీన, ఏఎస్ఐ గోవింద నాయక్ గ్రామ పెద్దలు పీర్ల స్వాములకు పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తజన సందోహం మధ్య గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ ఎర్రవాగుకు పీర్ల స్వాములను నిమజ్జనానికి తరలించారు. మొహరం ముగింపు వేడుకల సందర్భంగా కళాకారులు వేసిన వివిధ వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి