సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతోత్సవాల సందర్భంగా పుట్టపర్తి లో ట్రాఫిక్ కాంక్షలు కఠిన తరం చేసినట్లు డిఎస్పి విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించి పుట్టపర్తికి వివిధ ప్రదేశాల నుండి భక్తులు విఐపి లో తరలి వస్తుంటారని ట్రాఫిక్ ఆంక్షలు కఠిన తరం చేసినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు మామూలుగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా పార్కు చేస్తుంటారని కానీ ఇప్పటినుండి విద్యాగిరి వద్ద పార్కు చేసుకోవాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించి పుట్టపర్తికి తరలివచ్చే భక్తులు విఐపి లకు సహకరించాలన్నారు.