జహీరాబాద్: జర సంఘం కేతకి ఆలయ హుండీ లెక్కింపు, హుండీలో దర్శనమిచ్చిన రద్దయిన పాత నోట్లు
సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించినట్లు ఈవో శివ రుద్రప్ప తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయానికి 33.66 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన మూడు వెయ్యి రూపాయల నోట్లు, (23) 500 రూపాయల నోట్లు రూపాయల నోట్లు హుండీ లెక్కింపులో దర్శనమివ్వగా అధికారులు అవాక్కయ్యారు.హుండీలో భక్తులు సమర్పించిన బంగారు వెండి ఆభరణాలను తిరిగి హుండీలోని వేసినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో హైదరాబాద్ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.