వాంకిడి: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు ఇంటికే పరిమితమయ్యారు. కురుస్తున్న భారీ వర్షానికి పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణం తెలిపింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.