అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని గ్రామదేవత ఆలయం శ్రీ మారెమ్మ దేవమ్మ ఆలయంలో మంగళవారం కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పూజలు,కుంకుమార్చనలను నిర్వహించారు. తదుపరి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామదేవతలను దర్శించుకున్నారు.