జీడి నెల్లూరు నియోజక వర్గంలో బంగారమ్మ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా, కొన్ని రకాల పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.