ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక
Ongole Urban, Prakasam | May 20, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో ఈ నెల 25వ తేదీ వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాబోయే రోజుల్లో 45 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని బుధవారం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని వడదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలిపారు. వైద్యులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.