సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, పాల్గొన్న కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. గురువారం జరిగిన బతుకమ్మ వేడుకలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని పూజించి ప్రేమించే గొప్ప సాంస్కృతి తెలంగాణ సంస్కృతి అని అన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ బత్కమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, TNGOS నాయకులు తదితరులు పాల్గొన్నారు