నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ప్రారంభమైన వజ్రాల వేట,అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రజలు
Nandyal Urban, Nandyal | Jun 14, 2026
ఒక వజ్రమైన దొరికి అప్పులు తీరుతాయంటూ కోటి ఆశలతో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. చినుకు రాలితే చాలు నల్లమల అడవి వెంట ఉన్న వాగులు వంకలలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాల అన్వేషణ ప్రారంభిస్తారు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద వజ్రాల వంకలో ఆదివారం వజ్రాల కోసం వెతుకుతున్నారు