అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఇంటెల్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం నగర శివారులోని ఇంటెల్ కళాశాల సమీపంలో ద్విచక్ర వాహన మాదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కురుకుంట పంచాయతీలోని వైయస్సార్ కాలనీకి చెందిన రంగ రాజారెడ్డి అనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.