కర్నూలు: పంచలింగాల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత : ఎక్సైజ్ సీఐ చంద్రహాస్
కర్నూలు జిల్లా: పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు నిషేధిత గంజాయి ను పట్టివేసినట్లు కర్నూల్ ఎక్సేంజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. కర్నూల్ నగర శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది అని వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 44 ప్యాకెట్లలో 440 గ్రాముల డ్రై గంజాయి దొరికింది అని అన్నారు. ఒక్కో ప్యాకెట్లో 10 గ్రాముల చొప్పున ప్యాక్ చేసినట్లు సీఐ తెలిపారు.వాహనంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ఒకరు పాత నేరస్తుడైన ఈడిగ శ్రీనివాసులు గౌడ్ (S/o రమణ, టీచర్స్ కాలనీ, కర్నూ